ఘోర రోడ్డు ప్రమాదo, ముగ్గురు దుర్మరణం
Roadaccident: ప్రజా దీవెన, నర్సాపూర్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చో టుచేసుకుంది. జిల్లాలోని నర్సా పూర్ మండలం చిన్న చింతకుంట ప్రధాన రహదారి మలుపు వద్ద శని వారం రాత్రి ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది.రెండు బైక్‌లు, లారీ ఢీకొనడంతో ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మెదక్ నర్సాపూర్ ప్రధాన రహ దారిపై చిన్న చింతకుంట మలుపు వ ద్ద రెండు బైక్‌లు, లారీ ఢీకొన డంతో బైక్‌పై వెళ్తున్న వెంకట్రావుపేట గ్రామానికి చెందిన గోపి అతని కు మారుడు లోకేష్, గోమారం గ్రామా నికి చెందిన అతని వదిన కు మార్తె అక్కడికక్కడే మృతి చెందారు. మేరకు పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు జరుపుతు న్నారు.