పండుగ వేళ విషాదం, లారీ కింద పడి యువకుడి దుర్మరణం
Roadaccident: ప్రజా దీవెన, ఖమ్మం: సంక్రాంతి పండుగకు సోదరిని వెంట తీసుకె ళ్దామని వస్తుండగా జరిగిన దుర్ఘ టన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సోదరిని పండుగకు తీసుకెళ్ల డానికి వస్తున్న ఓ యువ కుడు ప్రమాదవశాత్తు లారీ కింద పడి మృతి చెందాడు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. టేకులపల్లి మండలం బేతంపూడి వెంక టాయతండాకు చెందిన బోడా వాత్యా కుమారుడు శ్రీనివాస్ (20) డిప్లొమా చదువుతున్నాడు.
ఆన సోదరి శ్రావ్య ఖమ్మంలో చదువుకుంటుండగా సంక్రాంతి సెల వుల్లో తీసుకెళ్దామని ద్విచక్ర వాహనంపై వచ్చాడు. ఈలోగా తన స్నేహితురాలు కలవడంతో ఆమెను బైక్‌పై ఎక్కించుకుని బయలు దేరాడు. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకోగానే ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ పక్కనుంచి వేగంగా పోనిచ్చాడు. ఈక్రమం లో లారీ శ్రీనివాస్ బైక్‌ను తాకడంతో అదుపు తప్పగా శ్రీనివాస్, ఆయన స్నేహితురాలు కిందపడ్డారు.
ఆ సమయాన శ్రీనివాస్ లారీ చక్రాల కింద పడడంతో నలిగిపోయి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో ఆయన స్నేహితురాలికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. తనను పండుగకు తీసుకె ళ్తామని వచ్చిన సోదరుడు మృతి చెందిన సమాచారం తెలుసుకుని వచ్చిన శ్రావ్య, తల్లిదండ్రులు వాత్యా – భాగ్యలక్ష్మి గుండెలవిసేలా రోదించారు.