Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Royalenfield : ‘డుగ్గు డుగ్గు బుల్లెట్’ అంటూ దూసుకొస్తున్న ఆంధ్ర మాధురి దీక్షిత్

ప్రజా దీవెన: తెలుగు చిత్ర ప్రేక్షకులకు జయతి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇదివరకు జెమినీ మ్యూజిక్ లో వెన్నెల అనే షో ద్వారా “వీడియో జాకీ”గా అలరించిన జయతికి అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం మాత్రమే కాకుండా.. ఆంధ్ర మాధురి దీక్షిత్ లా ఉంది అంటూ ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండేవారు అప్పట్లో.

ఇక వీడియో జాకీగా పనిచేసిన తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తోంది కూడా. అది కూడా నిర్మాతగా అండోయ్. తన సొంత నిర్మాణ సంస్థలో, లచ్చి అనే హారర్ కామెడీ జానర్ సినిమాను నిర్మిస్తూ అదే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించేసింది. ఆ అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ నటనకు మళ్లీ దగ్గరవుతోంది. తాజాగా “డుగ్గు డుగ్గు బుల్లెట్” బండి అనే ఒక ఆల్బమ్ సాంగ్ తో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టింది. నివృతి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ఏకంగా 2 మిలియన్ వ్యూస్ పైగా దక్కించుకుంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ ఫోక్ సాంగ్ లో జయతి తనదైన శైలిలో ఆకట్టుకుంది.

RoyalEnfield