Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RS Praveen Kumar: వరద బాధితులకు స్వేరోస్ నిత్యావసరాల పంపిణీ అభినందనీయం. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar: ప్రజా దీవెన, కోదాడ: ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో వచ్చిన ఆకస్మిక వరదలకు నష్టపోయిన కోదాడ మండల పరిధిలోని తొగరాయి కూచిపూడి గ్రామాలలో స్వేరోస్ ఆధ్వర్యంలో (Under Severos) ఆదివారం బియ్యం, నిత్యవసర సరుకులను పంపిణీ (Delivery of goods)కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెతుల మీదుగా దాదాపు 250 కుటుంబాలకు 10 కేజీల బియ్యం, పప్పు నూనె గోధుమపిండి పంచదార ఉప్పు పసుపు కారం తదితర 10 సరుకులను, గృహాలను తీవ్రంగా నష్టపోయిన వారికి పరుపులను, మొత్తంగా రెండు గ్రామాలలో దాదాపు 7 లక్షల విలువచేసే వస్తువులను పంపిణీ చేసినట్లు స్వేరోస్ నెట్వర్క్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)మాట్లాడుతూ వరదలతో ఎంతో నష్టపోయిన బాధితులకు స్వేరోస్ తమ సొంత ఖర్చులతో బాధితులకు అండగా నిలవడం ఎంతో అభినందనీయమని, తల్లిదండ్రులు తమ కన్నవారికి తోబుట్టువులు రక్తం పంచుకున్న వారికి కూడా ఏమీ ఇవ్వని ఇలాంటి సమయంలో స్వేరోస్ (Sweros)సమాజంలో బాధపడుతున్న వారిపట్ల దాతృత్వ గుణాన్ని కలిగి సహకరించడం స్వేరోస్ లక్షణాలలో ముఖ్యమని, బాధిత ప్రజలు ఈ కష్ట సమయాన్ని దిగమింగుకొని భవిష్యత్తులో మీ తలరాతలు మార్చేలా బిడ్డలను గొప్ప వారిగా తీర్చిదిద్దుకోవాలని అప్పుడే సమాజ తలరాతను మార్చే వ్యక్తులను తయారు చేసిన వారవుతారని ఆయన తెలిపారు కార్యక్రమంలో సీరియస్ నెట్వర్క్ వైస్ చైర్మన్ బాల ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరన్న, చెరుకుపల్లి కిరణ్, మచ్చా నరసయ్య, మైలారం జగన్, వీరస్వామి, నాగార్జున,లక్ష్మణ్, సునీత, కనకతార, పద్మ, ధనమ్మ, అంబేద్కర్,శాంసన్ తదితరులు పాల్గొన్నారు..