RTC Cargo services : ప్రజాదీవెన, భువనగిరి : భువనగిరి పట్టణంలో టిజిఎస్ఆర్టిసి లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్గో సర్వీస్ గురించి భువనగిరి మార్కెట్లో మరియు నల్లగొండ చౌరస్తా ప్రాంతంలో టీజీఎస్ఆర్టిసి హోమ్ డెలివరీ గురించి కస్టమర్లకు అవగాహణ కల్పించడం జరిగింది. బస్టాండ్ నందు గల కార్గో సర్వీస్ ద్వారా భువనగిరి వ్యాపారస్తులు టీజీఎస్ఆర్టిసి కార్గో సేవలను వినియోగించుకోవాలని, 24 గంటల్లో తెలంగాణ లోనీ అన్ని ప్రాంతాలలో డెలివరీ సదుపాయం కలదని అదే విధంగా హైదరబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరంలో హోం డెలివరీ సదుపాయం కలదని ప్రతి ఒక్కరు కూడా టిజిఎస్ఆర్టిసిని ఆదరించాలని ప్రచారం చేయడం జరిగినది ఏటీఎం సి. రవీందర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ సేల్స్ టీం సభ్యులు శ్యాంకుమార్, పిఎన్ రావు (మిర్యాలగూడ), హరిలాల్ (దేవరకొండ), ఎండీ.జానీ పాషా (సూర్యాపేట) మరియు ఆపరేషన్ టీం ఎల్ రాజశేఖర్ తదితరులు (కోదాడ) పాల్గొన్నారు.