–అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం
–వాడి వేడి చర్చలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం
–హరీశ్ రావు కు మాట్లాడే అవకాశ మివ్వాలంటూ పోడియంలోకి బీఆ ర్‌ఎస్ సభ్యులు
–ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా మీకు పట్టనేలేదు
–ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆస్తులను పార్టీ సభ్యులకు కట్టబెట్టింది మీరేనన్న పొన్నం
–మీరు చేసిన తప్పులే మమ్మల్నీ
చేయమంటారా అంటూ రేవంత్ ధ్వజం
RTC:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రభుత్వంలో (Telangana Govt) ఆర్టీసీ ఉద్యోగుల (RTC employees) ను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వంలో విలీనం అంశాన్ని బీఆర్‌ఎస్ సభ్యులు హరీ శ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమ లాకర్, కల్వకుంట్ల సంజయ్ లేవనె త్తారు. ఈ సందర్భంగా అధికార, విపక్షసభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతోందని సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో ఎప్పు డు విలీనం చేస్తారు, జాప్యానికి కారణం ఏమిటి అని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో (Congress Manifesto) కూడా విలీనం ప్రస్తావన ఉందనీ గుర్తుచేశారు. అ యితే ఆర్టీసీని బీఆర్‌ఎస్ సర్కారు నాశనం చేసిందని, సంస్థ కార్మికుల గురించి మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదని మంత్రి పొన్నం విమర్శిం చారు. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ సభ్యులంతా లేచి నిలబడి, నిరసన వ్యక్తం చేశారు. జోక్యం చేసుకున్న శాసనసభా వ్యవహారాల మంత్రి మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నో త్తరాల్లో నిరసన వ్యక్తం చేసే హక్కు సభ్యులకు ఉండదని, రూల్‌బుక్‌లో నూ ఎక్కడా లేదని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఓ దశలో హరీశ్‌కు మాట్లాడేందుకు అవకాశ మివ్వాలని కోరుతూ విపక్ష బీఆర్ ఎస్ సభ్యులు పోడియంలోకి దూ సుకెళ్లారు. చర్చ సందర్భంగా ఆర్టీసీ విలీనంపై జాప్యానికి కారణం ఏమి టి అంటూ విపక్ష సభ్యులు ప్రశ్నిం చగా ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని పొన్నం బదులిచ్చారు. దీన్ని హరీశ్ తీవ్రంగా ఆక్షేపించారు. మంత్రి (misnter) సమాధానం సభను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. యూని యన్‌ల పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారని ప్రశ్నించారు. తమ హయాంలో చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యులకు శాశ్వత ఉద్యో గాలు ఇచ్చామని, అయితే ప్రస్తుతం గౌరవవేతనంతో మూడేళ్లపాటు పనిచే యించుకొని, సంతృప్తి చెంది తేనే రెగ్యులరైజ్ చేసేలా నిబంధ నలు రూపొందించారని ఆక్షేపిం చారు. గత ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్‌రోడ్డులో ఆర్టీసీకి రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా చెక్కు ను చూపించారని, అది ఇప్పటి దాకా బస్‌భవన్‌కు చేరలేదని ఎద్దే వా చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ కింద ఆర్టీసీకి నెలనెలా నిధులు ఇవ్వడం లేదన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం పెరిగిందన్నారు.
ఎన్నికల ముందు విలీనం బిల్లు తెచ్చి నాటకాలు..: మంత్రి పొన్నం
పదేళ్లపాటు ఆర్టీసీని (rtc)నిర్వీర్యం చేసి, అసలు ఆర్టీసీ ఉంటుందా, ఉండదా అనే పరిస్థితిని కల్పించి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందు యాజమా న్యం, కార్మికులతో కూడా చర్చించ కుండా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం (Merger of RTC employees)బిల్లును బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిం దని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదించడం లేదని, రాజకీయ రంగు పులమడా నికి కార్మికులను రెచ్చగొట్టి, రాజ్‌భ వన్ ముందు ధర్నాలు చేయించార ని ఆక్షేపించారు. ఆర్టీసీ ఆస్తులను తమ పార్టీ ప్రతినిధులకు కట్టబెట్టా రని, యూనియన్లను రద్దుచేసి, వా టి పునరుద్ధరణ గురించి, మాట్లాడే హక్కు మీకుందా అని బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో 50 రోజుల పాటు కార్మికులు సమ్మె చేసినా పట్టించుకోలేదని, ఈ రోజు ఆర్టీసీ లాభాలతో నడుస్తోందని పకటిం చారు. గత పదేళ్లలో ఆర్టీసీ కార్మికు లకు చెందిన పీఎఫ్, సీసీఎస్ సొమ్ము రూ.4 వేల కోట్ల నిధులను వాడుకున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా రూ.2 వేల కోట్లను ఆర్టీసీకి ఇచ్చామని, మహాలక్ష్మితో పనిభారం పెరిగినా కార్మికులకు ఓటీ చెల్లించాలని ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హ యాంలో రోజుకు సగటున 45లక్షల మంది ప్రయాణాలు చేసేవారని, ప్రస్తుతం 56 లక్షల మంది ప్రయా ణం చేస్తున్నారని తెలిపారు.