Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RTC ministers ponnamprabhakar komatireddy ఆర్టీసీ బలోపేతంకై పటిష్ట చర్యలు

--దసరా లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 డీలక్స్ బస్సులు, 30 ఎక్స్ప్రెస్ బస్సులు --నార్కెట్ పల్లి డిపోకు పునర్ వైభ వంతో అక్కడినుండి అన్ని ప్రాంతా లకు బస్సులు పునరుద్ధరిస్తాం --నల్గొండ నుండి తిరుపతి, హైదరా బాద్ లకు ఏసీ బస్సులు --రాష్ట్ర ట్రాన్స్పోర్ట్,బి సి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడి

ఆర్టీసీ బలోపేతంకై పటిష్ట చర్యలు

–దసరా లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 డీలక్స్ బస్సులు, 30 ఎక్స్ప్రెస్ బస్సులు
–నార్కెట్ పల్లి డిపోకు పునర్ వైభ వంతో అక్కడినుండి అన్ని ప్రాంతా లకు బస్సులు పునరుద్ధరిస్తాం
–నల్గొండ నుండి తిరుపతి, హైదరా బాద్ లకు ఏసీ బస్సులు
–రాష్ట్ర ట్రాన్స్పోర్ట్,బి సి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడి
ప్రజా దీవెన నల్లగొండ: నూతనoగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టైన తర్వాత నష్టాలలో నడు స్తున్న ఆర్టీసీ (rtc) సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ( minis ter ponnam Pra bhakar goud) వెల్లడించారు.

శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ- హైదరా బాద్ కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సును రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి( minister komat ireddy venkatreddy) తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ను, కార్మికులను సంరక్షించేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నద న్నారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటై న 48 గం టల లోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ( free bus) కల్పించామని, నూతనంగా 1000 బస్సులను కొనుగోలు చేశా మని, మరో 1500 బస్సులను కొను గోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు.

నల్గొండ జిల్లాకు వచ్చే దసరా నాటికి 30 డీలక్స్ బస్సు లు ,మరో 30 ఎక్స్ ప్రెస్ బస్సులను మంజూరు చేస్తా మని, అలాగే హైదరాబాద్, తిరుపతి ( thirup athi) లకు ఏసి బస్సులను మంజూ రు చేస్తున్నట్లు మంత్రి అక్కడినుండి నల్గొండ జిల్లాలో 7 బస్సు డిపోలు ఉన్నాయని, 645 బస్సులు రెండు లక్షల 55000 కిలోమీటర్ల ప్రయాణించి, 3 లక్షల మంది ప్రయాణి కులను గమ్య స్తానాలకు చేరుస్తు న్నట్లు మంత్రి పేర్కొన్నారు.

జిల్లా పరిధిలోకి వచ్చే నార్కెట్ పల్లి బ స్సు డిపోకు ( narkatpal ly bus depo) పునర్ వైభవాన్ని తీసుకువచ్చి అక్కడి నుండి అన్ని ప్రాంతాలకు బస్సులను పునరుద్ధరించే విధంగా చర్యలు తీసు కుంటామని తెలిపారు.ఆర్టీసీ కార్మికుల ( rtc employees) సంక్షే మం లో భాగం గా 21% డిఎని ఇచ్చామని, 280 కోట్ల బకాయిల లో 80 కోట్లు ఇది వరకే ఇవ్వడం జరిగిందని, 200 కోట్ల రూపాయ లను ఈ నెలాఖ రునాటికి వారి వారి ఖాతాలలో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.

ఆర్టీసీ బలోపేతంలో భాగం గా నూతనంగా 3035 ఉద్యోగా లను (employment) భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొ న్నారు.ఆర్టీసీ ని ఆపరేషన్ నష్టాల నుండి బయటకు తీసుకు వచ్చే విధంగా ప్రభు త్వ సహకారంతో ముందుకు నడిపి స్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల నుండి హైదరాబాద్ కు ఏసీ బస్సు లు నడపాలని నిర్ణయం తీసుకు న్నా మని ,అవసరమైతే అసెంబ్లీ నియో జకవర్గాల నుండి రాష్ట్ర రాజధాని కి( state capital) ఏసీ బస్సులను నడుపు తామని, ముందుగా జిల్లా కేంద్రాల నుండి ఏసి బస్సు సౌకర్యా న్ని కల్పిస్తున్న ట్లు వెల్లడించారు.

రాష్ట్రం లోని అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు ,జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్ ( hyderabad) కు ఎలాంటి లోటు పాట్లు లేకుండా బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా చేర వేస్తామని చెప్పా రు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధి కారం లోకి వచ్చిన రెండవ రోజే మహిళలకు ( women) ఉచిత బస్సు సౌకర్యా న్ని కల్పించిందని, 60 నుండి 70 కోట్ల మంది మహి ళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.

టీజీ ఆర్టీసీని బలోపేతం (RTC strength) చేసేందుకు రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ చేస్తున్న కృషిని ఆయన అభి నందిం చారు .అప్పుల్లో ఉన్న ఆర్టీసీని పైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం అన్ని రకాల చర్య లు తీసుకుంటున్నదని అన్నారు. హైదరాబా ద్ తర్వాత ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 35 లక్షల జనా భాను కలిగి అతి పెద్ద జిల్లా గా నల్గొండ ఉందని, అందువల్ల నల్గొండ జిల్లా కు ప్రత్యేకంగా 25 బస్సు ల తో పాటు, నార్కెట్ పల్లి ఆర్టీసీ డిపోకి పునర్ వైభవం తీసుకురా వాలని,

ఉమ్మడి నల్గొండ ( nalgonda) జిల్లా మొత్తానికి 100 బస్సుల ను మంజూరు చేయాలని ఈ సంద ర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థాని క సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్ర ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆర్ టి సి ఆర్ ఎం రాజశేఖర్, డిప్యూటీఆర్ ఎం శివ శంకర్, ఆర్టీసీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RTC ministers ponnamprabhakar komatireddy