–వరంగల్ డిక్లరేషన్ హామీలు భోగి మంటల్లో కాల్చిన రైతులు
–సమగ్ర రుణ మాఫీ,రైతు భరోసా ఇచ్చేవరకు పోరాటం చేస్తాం
–మద్దతు తెలుపుతూ బిఆర్ఎస్ నాయకులు స్పష్టీకరణ
Rythu Barosa: ప్రజా దీవెన, వరంగల్: ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఎకరానికి 15000 చెల్లించాలి అని బి.ఆర్.ఎస్ డిమాండ్ చేసింది. సోమవారం మండలములోని పెద్దగూడెం గ్రామములో నాట్లు వేస్తున్న మహిళా కూలీలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని మహిళకు 2500ఇస్తామంటే గంప గుట్టగా ఓట్లు వేసామాని కె.సి.ఆర్ హయాములో వచ్చే రైతు భరోసా బొందపెట్టి మానోట్లో మట్టి కొట్టారని నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం పెద్దగుడెం చౌరస్తాలో బి.ఆర్.ఎస్ నాయకులతో కలసి రైతులు వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆ హామీల పత్రాలను భోగిమంటల్లో వేసి కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు.అనం తరం నాయకు…