Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sadness in happiness..! సంతోషంలో విషాదం..!

-- ప్రమాదవశాత్తు మెడిసిన్ పీజీ విద్యార్థి దుర్మరణం -- ఆదిలాబాద్ జిల్లాలో వాగులో పడి మరణించిన వైద్య విద్యార్ధి -- కోటిలింగాల ఆలయం మధ్య ఉన్న వాగులో సంఘటన

సంతోషంలో విషాదం..!

— ప్రమాదవశాత్తు మెడిసిన్ పీజీ విద్యార్థి దుర్మరణం

— ఆదిలాబాద్ జిల్లాలో వాగులో పడి మరణించిన వైద్య విద్యార్ధి
— కోటిలింగాల ఆలయం మధ్య ఉన్న వాగులో సంఘటన

ప్రజా దీవెన/ అదిలాబాద్: స్నేహితుల దినోత్సవాన్ని(friendship day) పురస్కరించుకొని సంతోషంగా గడుపుదాం అనుకున్న వారిలో విషాదం నింపింది విధి. అదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామీణ మండలం కుంభఝరి కోటిలింగాల ఆలయం మధ్య ఉన్న వాగు(The brook between the Kotilinga temple)లో ఆదివారం సాయంత్రం పీజీ వైద్య విద్యార్థి మృతి ( PG medical student dies) చెందిన ఘటన వీర్నపల్లి మండలం రంగంపేటలో విషాదం నింపింది. వైద్య విద్యనభ్యసిస్తూ అందులోనూ పీజీ విద్యార్థులుగా ఉన్న వారందరూ సరదాగా గడుపుదాం అనుకుంటే విది వక్రీకరించడంతో అతాశులయ్యారు.

వీర్నపల్లి మండలం రంగంపేటకు(rangampeta)చెందిన మాజీ సర్పంచి లక్ష్మి, ఉస్మాన్‌కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు శేఖర్ ఇంటి వద్ద వ్యవసాయం చేస్తుండగా చిన్న కుమారుడు ప్రవీణ్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పీజీ విద్యను అభ్యసిస్తున్నాడు.

స్నేహితుల దినోత్సవంతో పాటు ఆదివారం సెలవు కావటంతో తోటి మిత్రులు రాజు యాదవ్, కార్తిక్, టిటాస్, భవిష్య, రశ్మీ, ప్రత్యూష, రవళి, భూక్య ప్రవీణ్ రిమ్స్‌లో పీజీ ఆర్థో వైద్య వవిద్యార్ధులు ఆ ప్రాంతానికి వెళ్లారు.

ఆదివారం సాయంత్రం భూక్య ప్రవీణ్ కు చెందిన సెల్ ఫోన్ సమీపంలోని వాగులో జారి పడడంతో వెలికితీసేందుకు ప్రయత్నిస్తూ కార్తిక్, రాజు వాగులో ప్రవీణ్ లు జారిపడ్డారు. అయితే కార్తిక్, రాజు యాదవ్‌లకు ఈత రావటంతో బయటకు వచ్చేయగా ప్రవీణ్ మాత్రం వాగులో గల్లంతయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు (police), వైద్య కళాశాల అధికారులు(medical College officers) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పొద్దుపోయే వరకు ప్రవీణ్ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం తెల్లవారజామున వాగు ఒడ్డుకు ప్రవీణ్ మృత దేహం(dead body)కొట్టుకువచ్చింది.

దీంతో బిడ్డ మృత దేహాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కదిలించింది. కళ్లకు గంతలు ఉండటంతో ప్రవీణ్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.