Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Saidireddy : కేటీఆర్ మీద విమర్శలు మాని ఎన్నికల హామీల మీద దృష్టి పెట్టండి

Saidireddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :  నల్గొండ పట్టణ బిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద నిన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి మరియు బుర్రి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో నిర్వహించి స్థాయికి మించి మాట్లాడటం చాలా విచారకరం.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక స్థానం రావటానికి కారణం కేసీఆర్ మరియు కేటీఆర్ అన్న సంగతి కాంగ్రెస్ నాయకులు మర్చిపోవద్దు,అసలు మీ స్థాయి ఏంటో ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి గుమ్మల మోహన్ రెడ్డి మీరు ఒక కౌన్సిలర్ గా కూడా గెలవలేకపోయారు అన్నది మర్చిపోవద్దు.అదేవిధంగా మీరు ఈ విధంగా మాట్లాడితే నాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర క్రెడిట్ దక్కుతుందని మీరు అనుకోవటం ఊహాజనకమేకానీ, మీరు ఇన్ని సంవత్సరాలు నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఇన్ని సేవలు చేసినా నేటికీ మీ సేవల్ని మన వెంకట్ రెడ్డి గుర్తించలేదు ఇక రాబోయే రోజుల్లో గుర్తించరు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు, వారు వాస్తవంగా గుర్తిస్తే నేడు మీరు నేషనల్ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉండేవారు అన్న సంగతి మర్చిపోవద్దు.

 

నల్లగొండలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం లో వచ్చినటువంటి జీవోలకు అనుగుణంగానే జరుగుతున్న పనులు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్యాంకులు కూడా నమ్మటం లేదు.. గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులు స్థానిక గవర్నమెంట్ పనులకు నిధులు మంజూరు చేయడం జరిగింది.. కానీ నేడు బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి ముందుకు రావడం లేదు ఎందుకంటే గతంలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినాయి.. కానీ నేడు ఏ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. దానికి కారణం.ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ స్థానిక మంత్రి ఇన్ని సంవత్సరాలు నల్లగొండ ఎమ్మెల్యే గా ఉండి కూడా నల్లగొండ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయలేదు అన్నది మీరు మర్చిపోవద్దు.నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందటానికి మూల కారణం స్థానిక మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు.

 

ఇకనైనా గుమ్మల మోహన్ రెడ్డి మీరు మేల్కొని.. మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. మీ మంత్రి ని నేను ఇన్ని సంవత్సరాలు నిన్ను నమ్మి పనిచేస్తే చేస్తే నాకేం చేసినవ్ అని ఇప్పటికైనా అడగండి అంతేకానీ స్థాయికి మించి కెసిఆర్ ని నువ్వు కేటీఆర్ ను విమర్శిస్తే పదవులు రావు అన్న సంగతి మర్చిపోవదన్నారు.ఈ మీడియా సమావేశంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో పాటు అభిమాన్య శ్రీనివాస్,సింగిల్ విండో చైర్మన్ లు, వంగాల సహదేవ రెడ్డి, దోటి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కొండూరి సత్యనారాయణ, మారగోని గణేష్,మండల పార్టీ అధ్యక్షులు, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య,బొజ్జ వెంకన్న,కడారి కృష్ణయ్య,బడుపుల శంకర్ దొడ్డి రమేష్, బీపంగి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.