Saliganti Murali : ప్రజా దీవెన, కోదాడ: టిడబ్ల్యూజే ఐజెయు ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులుగా సలిగంటీ మురళి నీ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గింజల అప్పిరెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు మురళి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గింజల అప్పి రెడ్డి కి తోటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం నియోజకవర్గ అధ్యక్షులు మురళిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దాడుల నిరోధ కమిటీ అధ్యక్షులు బాదె రాము, ఆవుల మల్లికార్జున్, తూములూరి సత్యనారాయణ రాంబాబు, దశరథ రెడ్డి, హరినాథ్, వెంకటేశ్వర్లు, పల్లపు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, దామోదర్, కరుణాకర్, రహీం, , నాగరాజు,దిశ వాసు, వెలిశాల శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.