Samaram Reddy : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం లోని అకారం గ్రామ ప్రాథమిక, ఉన్నత పాఠశాల లలో మధ్యాహ్నం భోజనం వంట చేసేందుకు గ్యాస్ స్టవులు, సిలిండర్లను శాలిగౌరారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి,తన తండ్రి ఆకారం మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కందాల భద్రారెడ్డి 8వ వర్ధంతి సందర్బంగా జ్ఞాపకార్థం అందజేశారు.అంతకు ముందు భద్రారెడ్డి విగ్రహానికి పలువురు పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అయితగోని సైదులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండపెల్లి కొమరయ్య, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా, వల్లాల మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్ అహ్మద్, యూత్, ఎన్ఎస్ యూ ఐ మండల అధ్యక్షులు బొల్లికొండ గణేష్, లోడంగి మహేష్, నాయకులు చింత ధనుంజయ, కట్టగూరి సురేందర్ రెడ్డి, కందాల విప్లవ రెడ్డి, వలిశెట్టి సైదులు, అయితగోని శ్రవణ్ గౌడ్,గుత్తా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.