Samineni Pramila: ప్రజా దీవెన, కోదాడ: మహాత్మా గాంధీ జయంతి (Mahatma Gandhi Jayanti)సందర్భంగా బుధవారం పట్టణంలోని స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చి నందు చర్చి పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో స్త్రీల ఉజ్జివ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల (Samineni Pramila) ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సభను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ స్త్రీ లు కుటుంబానికి వెన్నుముక లాంటి వారిని నేటి సమాజంలో స్త్రీలు చదువుకున్నట్లయితే వారి కుటుంబాలు వెలుగుతో నిండుతాయని ఆమె అన్నారు.
మహిళలు చదువుకున్నట్లయితే సమాజంలో గౌరవం లభిస్తుందని నేటి సమాజంలో స్త్రీలు (గర్ల్స్ ) ప్రతి విషయంలోనూ పురుషులతో పోటీ పడాలని ఆమె తెలిపారు ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో నడవాలని స్త్రీలు ప్రార్థన పరులుగా ఎదగాలని అని తెలిపారు కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ కోఆప్షన్ (Christian Minority Co-op)సభ్యురాలు ఒంటిపాక జానకి యేసయ్యా అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిస్టర్ సుధారాణి సీనియర్ సిస్టర్ లలితా భాస్కర్ దైవజనురాళ్ళు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్ భాగ్యశ్రీ, స్రవంతి ,మెరీనారాణి, మౌనిక, శార ,అరుణ సీతా, కవిత ,ద్రాక్ష ,కోటి, కృష్ణవేణి, నవీన, తదితరులు పాల్గొన్నారు