Samineni Pramila: ప్రజా దీవెన, కోదాడ :కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji)ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల(Samineni Pramila) అన్నారు .శుక్రవారం కోదాడ పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఆయన ఫ్లెక్సీ కి అన్ని పార్టీల నాయకులు పద్మశాలి సేవా సంఘం సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ప్రధాన రహదారి డివైడర్ల మధ్యలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ, మలిదశ (First stage, Malidasa)ఉద్యమకారుడిగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని వారి సేవలను కొనియాడారు.ప్రతి ఒక్కరు వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఈదుల కృష్ణయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, పద్మశాలి సేవా సంఘం నాయకులు గోలి నాగరాజు, కొంగర నరసింహారావు, సంగిశెట్టి గోపాల్, నక్క చంద్రం, పిండిప్రోలు శ్రీనివాస్, సిట్టిప్రోలు గిరిప్రసాద్, ఎలగందుల శ్రీను, దేవరశెట్టి సైదులు, వేణు, గొర్రె రాజేష్, దేవరశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.