*మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు. సామినేని ప్రమీల
Samineni Pramila: ప్రజా దీవెన, కోదాడ: మున్సిపల్ కార్మికుల ఆరోగ్య (Health of municipal workers) పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల (Samineni Pramila) తెలిపారు.బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల కొరకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.కోదాడ మున్సిపాలిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అనారోగ్య సమస్యలు (Health problems)తలెత్తకుండా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్మికులందరూ వైద్య శిబిరాన్ని (Medical camp) సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలన్నారు. ఈ సందర్భంగా వైద్యులు కార్మికులందరికీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైద్యులు విజయ్ కుమార్, జోష్ణ, శానిటరీ ఇన్ స్పెక్టర్ యాదగిరి మున్సిపల్, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.