SAMPATH : ప్రజా దీవెన : కబడ్డీ అంటే అతనికి ఎంతో ఇష్టం. కబడ్డీ నేర్చుకొని ఎంతోమందికి దాన్ని నేర్పించిన వ్యక్తి. అతని వల్ల ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులు అయ్యారు.. అయితే తమకు కబడ్డీ నేర్పిన గురువు అనుకో కుండా రోడ్డు ప్రమాదంలో చనిపో తే అతని దహన సంస్కారాలను చాలా వినూత్నమైన విధముగా చేసి, ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఆ గ్రామస్థులు. వివ రాల్లోకి వెళ్తే …సిద్దిపేట జిల్లా అక్క న్నపేట మండలం చౌటపల్లి అనే గ్రామంలో ఇటీవల మృతి చెందిన సంపత్ అనే కబడ్డీ క్రీడాకారుడి చితిని కబడ్డీ కోర్ట్ ఏర్పాటు చేసి అందులో దహన సంస్కారాలు చేశారు తోటి మిత్రులు, గ్రామ స్థులు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కబడ్డీ ప్రేమికుడి అంత్య క్రియలను ఇలా వినూత్నరీతిలో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వద్ద సంక్రాంతి పం డుగ రోజు రోడ్డు ప్రమాదం జరిగిం ది. ఆ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు పులికాశి సంపత్ మృతి చెందాడు. దీంతో మృతుడి స్వగ్రామమైన అక్కన్న పేట మండలం చౌటపల్లిలో కబడ్డి క్రీడాకారులు, స్నేహితులు, గ్రామస్తు లు కబడ్డీ కోర్టు వేసి దహన సం స్కారాలు నిర్వహించారు