Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sanjay Gaikwad: రాహుల్ గాంధీ పై వివాదాస్పద వాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

— సంజయ్ గైక్వాడ్ పై చర్యలు తీసుకోవాలి..ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి,
శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.

Sanjay Gaikwad: శాలిగౌరారం సెప్టెంబర్ 17:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై మహారాష్ట్ర సీఎం షిండే (CM Shinde) వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad) చేసిన వాఖ్యలు వివాదస్పదకరంగా ఉన్నందున అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం పిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)నాలుక కోసిన వారికి 11 లక్షల రూపాయలు బహుమతి గా ఇస్తానని ప్రకటించడం విడ్డురంగా ఉందన్నారు.

ఈ ద్వేషపూరిత వాఖ్యలు సమాజం లో దుష్ప్రవర్తనను ప్రొచహించే లక్ష్యంతో ఉందని, జాతీయ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉందంన్నారు. ఈ వాక్యలు రాహుల్ గాంధీని (Rahul Gandhi)చంపేందుకు కాంట్రాక్ట్ (సుపారీ ) ఇవ్వడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే ఈ వాఖ్యల పై ఎఫ్ ఆర్ ఐ (fri)నమోదు చేసి ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, ఎస్ ఐ డి. సైదులు కు ఇచ్చిన పిర్యాదు లో కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు..మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, ఎమ్మెల్యే లు మందుల సామెల్, వేముల వీరేశం కూడా పిర్యాదు లో సంతకాలు చేసి ఇచ్చారు.