Sankranti Festival : ప్రజా దీవెన,కోదాడ: కోదాడ పట్టణంలోని స్థానిక సన ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరై విద్యార్థినీలతో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ముగ్గుల పోటీలు అన్నారు కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను ముందు తరం వారికి అందించాలని తెలిపారు కళాశాలలో ఈ సంబరాలను నిర్వహించడం అభినందనియమన్నారు. సంస్కృతిక కళ ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన తీరును ఆమె ప్రత్యేకంగా అభినందించారు. పండుగను పురస్కరించుకొని విద్యార్థినీలకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలో గెలుపొందిన ప్రధమ, ద్వితీయ ,తృతీయ విద్యార్థినీలకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బహుమతులను అందజేశారు.
ముందుగా కళాశాల డైరెక్టర్ నౌమన్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, టిపిసిసి డెలిగేట్స్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, వ్యవసాయం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ కే బషీర్ యూత్ కాంగ్రెస్ నాయకులు డేగ శ్రీధర్ వార్డు కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్, కర్రి శివ సుబ్బారావు కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ నాగ ప్రసాద్, హెచ్ ఓ డి, అధ్యాపకులు అధ్యాపకేతర బృందం విద్యార్థినీలు తదితరులుపాల్గొన్నారు.