ప్రజా దీవెన, కోదాడ: భారతదేశ ఆర్థిక దార్శనికుడు, అని తేజ పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ అన్నారు గురువారం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన సందర్భంగా శుక్రవారం స్థానిక తేజ టాలెంట్ పాఠశాల ఉపాధ్యాయులు, చింతిస్తూ, మౌనం పాటించి, సంతాపాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి సంస్కరణల రూపశిల్పిగా పేరు ప్రఖ్యాతలుగాంచి, తాను మౌనంగా ఉండి దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలియపరిచిన దార్షనీకుడు తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎం అప్పారావు మాట్లాడుతూ దేశం రాజకీయంగా, ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దాదాపు పది సంవత్సరాల కాలం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసి దేశం యొక్క స్థితిగతులను మార్చి చక్కటి సంస్కరణలతో ప్రతిష్టపరిచిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ అని తెలిపారు