— ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్
Collector Narayana Amit : ప్రజాదీవెన నల్గొండ : నిర్దేశించిన సమయంలో గా వనమహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఎంపీడీవోలకు సూచించారు. ప్రతి వారం నిర్వహించే వారాంతపు సమీక్షలో భాగంగా మంగళవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో సోక్ పిట్ల నిర్మాణం పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో న్యూట్రి గార్డెన్ల పెంపకం, వనమహోత్సవం కింద గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, నర్సరీలను చేపట్టడం, స్వచ్ఛభారత్ కింద పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ ,ఇందిరమ్మ ఇండ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ, వర్మి కంపోస్ట్ తయారీ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ,డిపిఓ వెంకయ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, పంచాయతీరాజ్ ఈ ఈ, ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.