–బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
Sardar Sarvai Papanna Goud : ప్రజాదీవెన , నల్గొండ టౌన్ : జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరుని నామకరణం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాపన్న గౌడ్ జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్చి బహుజనులందరికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్క బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్, బహుజన సమాజ్వాది పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల కాశీరాం, పజ్జురి అశోక్ గౌడ్, దండంపెల్లి అనిల్ కుమార్ గౌడ్, ప్రదీప్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.