–కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ షబ్బీర్ బాబా
Sarpanch Shabbir Baba : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : నల్గొండ మండల పరిధి లోని కాజీరామారం గ్రామంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ మున్వర్ ఉన్నిసా షబ్బీర్ బాబా, గ్రామ రేషన్ డీలర్ రవికుమార్ తో కలిసి సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్.కె షబ్బీర్ బాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ 15 నెలల్లోనే చేసిందని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఎస్.కె మమ్మద్, గోలి కృష్ణ, అనంతుల వేణు, సల్వాది సైదులు, నకరికంటి సైదులు, దండంపల్లి యుగంధర్, బొంగరాల నాగయ్య, పేరుపాక మనోహర్, బొడ్డుపల్లి రాజేష్, చింత రవి, జాఫర్, గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.