Sarvai Papanna : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాడాలని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు తండు సైదులు గౌడ్ ,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య లు పిలుపునిచ్చారు. బుధవారం 11వ వార్డు కతాల గూడెంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ 16వ శతాబ్దంలోని బహుజ నులందరినీ కలుపుకొని గోల్కొండ ను ఏలిన చరిత్ర పాప న్నది అని అన్నారు. ఆయన స్ఫూ ర్తితో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభు త్వా లు అవలంబిస్తున్న బడుగు బల హీన వర్గాల, చేతి వృత్తిదారుల హక్కులకు నష్టం కలి గిస్తున్న విధానాలపై పోరాటాలు నిర్వహించాలని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న సేఫ్టీ కిట్లు నామమాత్రంగా ఊరుకో కోడి ఇంటికో ఈక ఆన్న చందంగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చి చేతులు దులుపు కున్నారని అన్నారు.కతాల్ గూడ లో కల్లు గీసే కార్మికులకు ఇంతవరకు ఒక్కటి సేఫ్టీ కిట్టు కూడా రాలేదని అన్నారు. కల్లుగీసే కార్మికులకు ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి కేటాయించి తాటి ఈత వనాల పెంచాలని, కల్లుకు ప్రత్యామ్నాయ మార్కెట్ సౌకర్యం కల్పించి కల్లుగీత కార్మికుల జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పాలకూ రి సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు పజ్జురి ప్రదీప్ గౌడ్ కోశాధికారి దండంపల్లి అనిల్ గౌడ్, మాజీ కౌన్సిలర్ దండెంపల్లి సత్తయ్య, వార్డు గౌడ సంఘం నాయకులు, కల్లు గీత కార్మికులు పజ్జురి అంజయ్య దండెంపల్లి మారయ్య,యాదయ్య, పజ్జురి పరమేష్, పనస చంద్రయ్య, పజ్జురి అశోక్ గౌడ్, కార్తీక్, పనస దేవేందర్, పాలకూరి శ్రీహరి, పజ్జురి సత్యనారాయణ ,పల్లె నగేష్, పాలకూరి చిరంజీవి, మాధగోని యాదగిరి ,చేవుగోని వెంకన్న, పామనగుండ్ల రాజు, దండెంపల్లి నరసింహ, లక్ష్మణ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.