Sarvothama Reddy : ప్రజా దీవెన,నల్గొండ: బిజెపి పార్టీ తరఫున తపస్ ఉపాధ్యాయ సంఘం మద్దతుతో నల్లగొండ, వరంగల్ ,ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయుచున్న ఎమ్మెల్సీ అభ్యర్తి పులి సరోత్తం రెడ్డి నామినేషన్ పత్రాల దాఖలు చేశారు
ఈ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గుజ్జల ప్రేమెందర్ రెడ్డి,కాసం వెంకటేశ్వర్లు పాల్గొని మీడియాతో మాట్లాడారు..
ఉపాధ్యాయుల సమస్యల పట్ల అవగాహన కలిగిన సర్వోత్తమ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు..
గత ప్రభుత్వం విద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని అదే విధంగా కాంగ్రెసు ప్రభుత్వం కూడా విద్య రంగంపై నిర్లక్యంగా వ్యవహరిస్తూ విద్య రంగాన్ని బలహీన పరచింది అని వారు ఆరోపించారు
కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పన్నెండు లక్షల ఆదాయం వరకు పన్ను మినాయింపు ఇవ్వడం ఉపాధ్యాయులకు మంచి ఊరట నిచ్చింది అని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి,
బిజేపీ రాష్ట్ర నాయకులు నూకల నరసింహారెడ్డి,వీరెల్లి చంద్రశేఖర్, చల్ల శ్రీ లత రెడ్డి,పాలకూరి రవిగౌడ్,మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, బిజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు