Savitri Bai Phule: ప్రజా దీవెన,కోదాడ: లోని స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణలో యం ఎస్ విద్యా సంస్థ, ప్రజా చైతన్య వేదిక సంయుక్తంగా శుక్రవారం సావిత్రి బాయి పూలే 193 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, సభ్యులు పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు,గొప్ప రచయిత,బడుగు బలహీవర్గాల మహిళల విద్యాభివృద్ధికి విశేష కృషి సల్పిన వ్యక్తి సావిత్రి బాయి పూలే అని అన్నారు.
ఆనాడు సమాజంలో ఎన్నో అవమానాలకు,ఉన్నత వర్గాల నుండి దాడులకు గురి ఐనప్పటికీ అన్నింటినీ ధైర్యం గా భర్త సహకారం తో ఎదుర్కొని మహిళలు విద్య ద్వారానే అభివృద్ధి లోనికి వస్తారని విద్యాభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు,ప్రజా చైతన్య వేదిక బాధ్యులు బంగారు, హరికిషన్,అధ్యాపకులు పి.గంగాధర్ రావు ,విజయ భాస్కర్,వెంకటరెడ్డి,శ్రీనివాస రావు, నాగేశ్వరరావు,వీరాస్వామి,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.