SBIShaligouraram: ప్రజా దీవెన ,శాలిగౌరారం : స్టేట్ బ్యాం క్ అఫ్ ఇండియా శాలిగౌరారం బ్రాంచ్ మేనేజర్ గా గంగుల వెంకట రవి బాధ్యతలు స్వీకరించారు.ఈయన సూర్యాపేట జిల్లా తిరుమ లగిరి ఎస్ బి ఐ మేనేజర్ గా పనిచేస్తూ శాలిగౌరారం కు బదిలీ పై వచ్చారు. శాలిగౌరారం లో మూడేళ్ళ పాటు ఎస్ బి ఐ మేనేజర్ గా పనిచేసిన వై. శ్రీనివాస్ రావు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమoడ్ల ఎస్ బి ఐ కి మేనేజర్ గా బదిలీ పై వెళ్లారు.
నూతనంగా బ్యాంక్ మేనేజర్ గా భాద్యతలు స్వీకరించిన గంగుల వెంకట రవి మాట్లాడుతూ బ్యాంక్ వినియోగదారుల కు అందుబా టులో ఉండి బ్యాంక్ అభివృద్ధి కి కృషి చేస్తానన్నారు.క్రాఫ్ట్ లోన్, బంగారు ఆభరణాల పై రుణాలు తీసుకున్నవారు సకాలంలో చె ల్లించి బ్యాంక్ అభివృద్ధికి కి సహకరించాలని కోరారు.