Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SC Gurukula: నెమలిపురి ఎస్సీ గురుకుల విద్యార్థుల అవస్థలు…..

*వర్షం కారణంగా విద్యుత్  లేకపోవడంతో ఆరుబయటే కాలకృత్యాలు.

SC Gurukula: ప్రజా దీవెన,కోదాడ: మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ పరిధిలోగల నెమలిపురి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల SC Gurukula)పాఠశాల వసతి గృహ విద్యార్థులు తాగునీరు (drinking water)లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రాత్రి నుండి వర్షం కారణంగా కరెంటు లేకపోవడంతో కాలనీ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇద్దరూ  విద్యార్థులు  కలిసి ఒక బకెట్ నీళ్ళు తిన్న ప్లేట్లు (Watered plates)కడిగేందుకు కిలోమీటర్ దూరం మోసుకుంటూ వెళ్తున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉండగా మొత్తం విద్యార్థులు 532 మంది చదువుకుంటున్నారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వర్షం వచ్చిన రోజు కరెంటు పోయిన రోజు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మిగతా సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదని తెలిపారు.