–నూతన భవనానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలి
–కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
SC Hostel:ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహం శిథిలావస్థకు (The dormitory is dilapidated)చేరి విద్యార్థులపై కూలే ప్రమాదం ఉందని వెంటనే ప్రైవేట్ బిల్డింగ్ (Private Building) లోకి మార్చాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. మునుగోడు మండల కేంద్రంలో సంక్షేమ హాస్టల్లో (ఎస్సీ,బీసీ) అధ్యయన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ మునుగోడు ఎస్సీ హాస్టల్ కు నూతన భవనానికి నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. హాస్టల్లో కనీసం తలుపులు లేవని కిటికీలు లేవని తలుపులకు చెక్కలు, రేకులు,చెద్దర్లు, అడ్డం పెట్టుకొని విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.
చాలా దౌర్భాగ్య స్థితిలో (miserable state)వారి పరిస్థితిలు ఉన్నాయని తెలియజేశారు. పురాతనమైన భవనం పెచ్చులూడి కూలడానికి సిద్ధంగా ఉంది, పాములు, కుక్కలు ఎలుకలు, విద్యార్థులతో సవాహసం చేసే పరిస్థితి ఉందని అన్నారు. గౌరవ మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఎస్సీ హాస్టల్లో (SC Hostel)సందర్శించి పరిస్థితులు పరిశీలించాలని వెంటనే ప్రైవేటు భవనంలోకి మార్చుటకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతన భవనానికి నిధులు కేటాయించి పూర్తి చేయించాలని కోరారు. మునుగోడు శాసనసభ్యులు హాస్టల్ సందర్శించడానికి విద్యార్థుల దౌర్భాగ్యస్థితిని పరిశీలించడానికి ఒక గంట సమయం లేదా అని ప్రశ్నించారు. మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు అనంతరం బీసీ హాస్టల్ సందర్శించారు.
విద్యార్థులకు (students) సరిపడా భవనం లేదని ఇరుకైన భవనంగా ఉందని కనీసం ఆటలు ఆడుకోవడానికి స్థలం లేదని బట్టలు ఉతకడానికి వాష్ ఏరియా కూడా లేదని తెలిపారు. బాత్రూం డోర్లు పోయినప్పటికీ వెంటనే పెట్టించుటకు కృషి చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ప్రతిరోజు ఉదయం అన్నము వండి పెట్టడం మానుకొని అవసరమైన టిఫిన్లు మెనూ ప్రకారంగా పెట్టాలన్నారు. విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు , పెట్టెలు, బట్టలు, నోట్ పుస్తకాలు,చద్దర్లు,చెప్పులు, కాస్మోటిక్ బిల్లులు, (Plates, glasses, boxes, clothes, note books, umbrellas, shoes, cosmetic bills)పంపిణీ చేయాలని తెలిపారు. ఆట వస్తువులు కూడా సరఫరా చేయాలన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు మునుగోడు హాస్టల్లో సందర్శించాలని తెలియజేశారు. సంక్షేమ హాస్టల్లో అధ్యయన యాత్ర ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. అనంతరం సంక్షేమ హాస్టల్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవీపీస్ జిల్లా ఉపాధ్యక్షులు బొట్టు శివకుమార్ మునుగోడు మండల కార్యదర్శి వంటేపాక అయోధ్య తదితరులు పాల్గొన్నారు.