— ప్రజా దీవెన కథనానికి కలెక్టర్ స్పందన
— జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగింత
SC Welfare : ప్రజాదీవెన నల్గొండ : కలెక్టర్ ఉత్తర్వులు వెనుక మర్మం ఏమిటి” అనే శీర్షికన ప్రజా దీవెన దినపత్రికలో వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు.
వార్తలో వచ్చిన అంశాన్ని పరిశీలించిన మీదట జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత ఆర్గనైజేషన్లు, లీడర్లను హాస్టల్లలోకి అనుమతించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, అయితే తన ఉత్తర్వులకు భిన్నంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారిగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కోటేశ్వరరావును ఆ బాధ్యతలనుండి తప్పించి జిల్లా పరిషత్ సీఈవో ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.