ప్రజా దీవెన, శాలిగౌరారం: ప్రజాపాలన పేరుతో ప్రైవేట్ స్కూళ్లను బందు చేయించి ప్రతి స్కూలు బస్సులను ప్రజా పాలన పేరుతో స్కూల్ బస్సులను ఈ సభకు వాడుకోవటం ఎంతవరకు సమంజససమని శాలిగౌరారం మండల బిజెపి అధ్యక్షులు జమ్ము రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన శాలిగౌరారం లో శనివారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టడమే తప్ప విద్యార్థుల స్కూలుకు సెలవు పెట్టించి అట్టి బస్సులను సభలకు తరలించటం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమారటమే తప్ప ఇది వేరొకటి లేదన్నారు.
సమావేశం కొరకు ప్రైవేటు స్కూల్లో బస్సులను సెలవు పెట్టించి బస్సులను తీసుకపోవటం ఎంతవరకు సమంజసం అన్నారు.విద్యార్థుల భవిష్యత్తు కంటే ప్రజాపాలనకి ముఖ్యమైన విధంగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అధికార దుర్వినియోగమే తప్ప వేరొకటి లేదు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం ప్రైవేట్ స్కూలు యాజమాన్యం కూడా బస్సులు పెట్టడం ఎంతవరకు సమంజసం స్కూల్ బందు చేయించి దీనికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సభల కోసం స్కూలు బందు చేయించి బస్సులను పంపడం స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు.