Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Science Day : సైన్స్ తోనే దేశాబివృద్ధి

Science Day : ప్రజా దీవెన శాలిగౌరారం ఫిబ్రవరి 28 : శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని శాలిగౌరారం ఎస్ ఐ డి. సైదులు అన్నారు. శాలిగౌరారం లోని గీతంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో శుక్రవారం సైన్స్ దినోత్సవ సందర్బంగా విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.ఎస్ ఐ సైదులు పాఠశాలకు వచ్చి ఎగ్జిబిషన్ ను తిలకించి విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు..ఈ కార్యక్రమం లో స్కూల్ కరస్పండెంట్ దొంతూరి పరమేశ్వర్ రావు , ప్రిన్సిపాల్ ప్రభంజన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.