Science Day : ప్రజా దీవెన, కోదాడ:నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్ర వేత్త సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సందర్భంగా కె ఆర్ ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలనుఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హడసా రాణి మేడం సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ హడస రాణి మేడం మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా నోబెల్ బహుమతి 1930 ఫిబ్రవరి 28 న లభించిందన్నారు.
ప్రభుత్వం అందుకు గుర్తింపుగా ఫిబ్రవరి 28 న సైన్స్ డే ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సైన్స్ అనేది మానవ జీవన పురోగతికి ఎంతో ఉపయోగ పడిందని తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సైన్స్ ద్వారానే సాధ్యమైందని మూఢనమ్మకాలు మూఢ ఆచారాలను రూపుమా పాలన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చందా అప్పారావు, డాక్టర్ B.సైదిరెడ్డి కే.నాగిరెడ్డి, భౌతిక శాస్త్రం అధ్యాపకులు ఏ.సుమలత, వి.శ్రీలత, జి. సైదులు, ఆకుల రాజు, వి వెంకటేశ్వరరెడ్డి ఇతర అధ్యాపక మిత్రులు పాల్గొన్నారు.