Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Secretary Dandempalli Sathaiah : బీటీ రణధీవే స్ఫూర్తితో పోరాడుదాం

–సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య

Secretary Dandempalli Sathaiah : ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రుణదేవే స్ఫూర్తితో సామాజిక న్యాయ సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణధేవే 35 వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ సిఐటియు అఖిలభారత కమిటీ పిలుపుమేరకు అమరవీరుల స్ఫూర్తితో సామాజిక న్యాయం సాధించడం కోసం ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్మిక వర్గాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో చీల్చి కార్పోరేట్ శక్తులు తమ దోపిడీ కొనసాగిస్తున్నాయని అన్నారు.

 

మనువాదాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని మహిళల, మైనారిటీ, దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ మనుషులంతా ఒక్కటే అంటూ సామాజిక న్యాయం కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని సిఐటియు పోరాడుతుందని అన్నారు. సామాజిక న్యాయ సాధన క్యాంపెన్లో భాగంగా 9వ తేదీ సామాజిక న్యాయ సంఘీభావనిధి వసూలు, 10వ కామ్రేడ్ విమల రణదేవి జయంతి, 11న మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి, 13న బైక్ ర్యాలీ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వారోత్సవాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం బిక్షం, సిఐటియు పట్టణ నాయకులు అవుట రవీందర్, అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, కోట్ల అశోక్ రెడ్డి, పల్లె నగేష్, పాక లింగయ్య, గంజి నాగరాజు, పందుల లింగయ్య, ఔరేశు మారయ్య, వేముల వెంకన్న, దాసోజు ప్రభుచారి, సీత వెంకటయ్య, గడగోజు శ్రీనివాస చారి, ఆవుల శ్రీను, వీరయ్య, మల్లి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.