Secretary Sriram Naik : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 9 గంటలకు మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి.శ్రీ సేవాలాల్ మహారాజ్ భవన్ (హైదరాబాద్ ) బంజారా హిల్స్ నందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ట్రైకార్ చైర్మన్ లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డా.బెల్లయ్య నాయక్ తేజావత్ ఆధ్వర్యంలో కార్యక్రమము జరుగుచున్నది. ఈ బోగ్ బండారు సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు అని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్ రమావత్ అన్నారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా ఉద్యోగస్తులు, లంబాడి ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శ్రీరాం నాయక్, రమేష్ నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్, జిల్లా అధ్యక్షులు దేవజి నాయక్, ఉద్యోగ సంఘం కోశాధికారి, లక్ష్మణ్ నాయక్, మహిళా అధ్యక్షురాలు దేవి బాయ్, రాము నాయక్, చంటి నాయక్, కిషన్ నాయక్, నల్లగొండ పట్టణ అధ్యక్షులు యాదగిరి నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.