southern states: ఆత్మగౌరవం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణం
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి తనదైన శైలిలో ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్(BRS Party) పార్టీ ఉండదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి తనదైన శైలిలో ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని ఆమె పేర్కొ న్నారు. ఆత్మగౌరవం, పోరాటత త్వం దక్షిణాది రాష్ట్రాల(southern states) సహజ లక్షణమని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకు న్నట్లు బీజేపీ(BJP)అర్థం చేసుకోలేక పోయిందని రాములమ్మ విమర్శిం చారు. ఈ మేరకు కిషన్ రెడ్డి(Kishan reddy) వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా విజయశాంతి స్పందించారు.
ట్వీట్ సారాంశం ఇలా ఉంది.
తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రా యం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాల ను వారి ఆత్మాభిమానం వైపు నడి పిస్తూనే వస్తుండడం దక్షిణాది రా ష్ట్రాల సహజ విధానమని, ఎప్ప టికీ ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి, దక్షిణాది దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీ ఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆ ర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీ య సమాధానం విశ్లేషించుకోవాల్సి న తప్పని అవసరం ఎన్నడైనా.. వాస్తవం…ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలో చన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.
Self-respect natural characteristic of southern states