Sellor Accident : ప్రజా దీవెన, హైదరాబాద్: మట్టి దిబ్బల కింద మట్టి మనుషులు అసువులుబాశారు. మట్టి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్క సారిగా మట్టి కూడడంతో కూలీల బతుకులు కునారిల్లాయి. హైదరా బాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో ప్రాంతంలో ఓ సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.
రోజువారి వృత్తిలో భాగంగా కూలీలు సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టిదిబ్బలు కూలి ముగ్గురు కూ లీలు అక్కడికక్కడే మృతి చెందా రు. స్థానిక పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కలిసి ఒక మృతదేహాన్ని బయటకు తీయగా మరో ఇద్దరి కోసం యంత్రాలతో తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు బీహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.