Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Semi Christmas Celebrations: కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్

*ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

ప్రజా దీవెన, కోదాడ :పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని బాలురు ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు పరిశాల రఘు అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి, స్వీట్లు అందించారు ముందుగా క్రైస్తవులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.

అన్ని మతాల సారం ఒకటేనని.. మత విద్వేషాలు విడనాడి తోటి వారితో సోదర భావంతో మెలుగుతూ.. క్రీస్తు మార్గంలో పయనించాలి… తోటి వారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశం అన్నారు. క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు. క్రైస్తవం అనేది ఒక మతం కాదు.. అదొక జీవన విధానం.. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ,సహకారాలు అందిస్తామన్న తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఎస్ఐ పాస్టర్ యన్.పాల్, ముస్లిం మతపెద్ద హామీద్ మౌలానా, జర్నలిస్టులు గాంధీ, పూర్ణ, వెంకటనారాయణ, లక్ష్మణ్, నాగరాజు, మైముద్, నజీర్,నరేష్, వీరబాబు, రామకృష్ణ, రహీం, శ్రీహరి, పవన్, భాస్కర్, సైదులు, నాగేంద్రబాబు రామకృష్ణ నాయకులు పందితిరపయ్య శ్రీకాంత్, రహీం, నజీర్, తదితరులు పాల్గొన్నారు.