ప్రజా దీవెన, కోదాడ: అనంతగిరి మండల యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కర్మేలు ప్రార్థన మందిరము నందు పాస్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ పాస్టర్ రాజేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిషప్ దుర్గం ప్రభాకర్ బైబిల్ సందేశకులుగా పాస్టర్ ప్రశాంత్, యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య పాల్గొని మాట్లాడుతూ క్రీస్తు యొక్క ప్రేమను దయలత్వాన్ని అలవర్చుకొని పాటించాలని అన్నారు అయన మానవాలి కి చేసిన ప్రాణ త్యాగాన్ని వివరించారు.
అనంతరం కేక్ కట్ చేసి వచ్చిన క్రైస్తవ భక్తులకు అందచేశారు . అలాగే క్రైస్తవ భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు ప్రేమవిందు ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షలు జి ఆర్ అబ్రహం, కోఆర్డినేటర్ యమ్ సుందర్ రావు, అనంతగిరి మండల ప్రెసిడెంట్ డానియల్ నాయక్,కోదాడ మండల ప్రెసిడెంట్ శాంతవర్ధన్, ఏసురత్నం అనంతగిరి మండల కమిటీ సభ్యులు శామ్యూల్ ఆనంద్ రావిపాల్ ,హరిగోమ్స్, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.