Senior Officers Prasad : ప్రజా దీవెన, నల్లగొండ: ఉద్యోగులు తమ వృత్తి తో పాటు ఆట పాటల్లో కూడా చురుకుగా పాల్గొనాలని, త ద్వారా వివిధ రంగాల్లో తమ నైపు ణ్యాన్ని పెంచుకోవచ్చని భారత ఆ హార సంస్థ నల్గొండ జిల్లా డివిజ నల్ మేనేజర్ సువీన్ కుమార్ అ న్నారు. సంస్థ 61 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వ హించిన వివిధ క్రీడాంశల్లో గెలుపొం దిన వారికి సంస్థ AGM (QC) డా. రాఘవేంద్ర సింగ్ తో కలిసి బహు మతి ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల ఆహార భద్రతకు భారత ఆహార సంస్థ గత 61 సంవత్సరాలుగా నిరంతరం పాటుపడుతోందని పేర్కొన్నారు.
సందర్భంగా క్రికెట్, చెస్, క్యారం బోర్డు, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ వంటి ఆటల్లో పాల్గొన్న వారికి, విజేతలకు ఆయ న శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తు లో మరింత మెరుగ్గా రాణించేలా ప్రయత్నం చేయాలని అభిలషిం చారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ అధికారులు ప్రసాద్, కృష్ణవేణి, సుకుమార్, బిల్లా శ్రీనివాస రావు, నిర్వాహకులు సతీష్ రెడ్డి, సుమిత్,శుభకర్ , కరుణాకర్, సజిత్, గోపీచంద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొ న్నారు.