Seva Ratan Award : నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన అమ్మ జ్యోతి అనాథ ఆశ్రయం ఫౌండేషన్ నిర్వాహకులు భీమనబోయిన వీరభద్రయ్య కు సేవా రతన్ అవార్డు లభించింది. వీరభద్రయ్య గత ఐదు సంవత్సరాల నుండి హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో అమ్మ జ్యోతి అనాధ ఆశ్రమం నడిపిస్తూ అనాధ పిల్లలకు, వివిధ ప్రాంతాల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ ఫౌండేషన్ సేవలను గుర్తించి మ్యాజిక్ బుక్ అఫ్ రికార్డు వారు సేవారతన్ అవార్డు ను న్యూఢిల్లీలో వీరభద్రయ్య కు ప్రధానం చేశారు.ఫౌండర్ భీమనబోయిన వీరభద్రయ్య కు గతంలో డాక్టర్ అవార్డు కూడా లభించింది.
సేవలను గుర్తించి ఈ సేవారతన్ అవార్డు అందజేసిన మ్యాజిక్ బుక్ అఫ్ రికార్డు వారికి వీరభద్రయ్య ధన్యవాదాలు తెలిపారు. వీరభద్రయ్య కు సేవా రతన్ అవార్డు రావడం పట్ల పలువురు ఆయనను అభినందించి ఘనంగా సన్మానించారు.