–భర్తపై , అబార్షన్ చేయించిన ఇద్దరు ఆర్.ఎం.పి లపై స్కానింగ్ పరీ క్షలు నిర్వహించిన,సహకరించిన వారిపై కేసు నమోదు
Pregnant Woman Death Case : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగ తుర్తి మండల కేంద్రంలో ఇటీవల సూర్యాపేట జిల్లాలోని సంచలనం కలిగించిన 26 ఏళ్ల గర్భిణీ మహిళ ఆర్ఎంపీ డాక్టర్ అబార్షన్ చేయడం తో మృతి చెందిన సంఘటన లో ఏ డుగురు నిందితులపై పోలీసులు కే సు నమోదు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి. సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపిన వి వరాలు ఇలా ఉన్నాయి. ముందస్తు లింగనిర్ధారణ పరీక్ష నేరము అర్హత లేకుండా వైద్యం చేయడం మరో నేరము వైద్య చట్టాల ప్రకారం ముం దస్తు లింగనిర్ధారణ నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పి హెచ్చరిం చారు. కడుపులో ఉన్నది ఆడబిడ్డ మగ బిడ్డ అని లింగ నిర్ధారణ పరీక్ష చేయించి ఆడబిడ్డ అని తేలడంతో తుంగతుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ నందు అబార్షన్ చేయగా మ హిళ మృతి చెందిన సంఘటన చో టుచేసుకున్నది అని ఇది చట్టరీ త్యా నేరమన్నారు.
మద్దిరాల మండలం గోరంట్ల గ్రామా నికి చెందిన బయగల శ్రీను తన భా ర్యకు కడుపునొప్పి రాగా తుంగతు ర్తి సాయి బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా ప్రైవేట్ డాక్టర్ పరీక్ష లు చేసి బిడ్డ అడ్డం తిరిగిందని వై ద్యం చేయగా తీవ్రంగా అస్వస్థత గురి అయి నదని తన భార్య విజిత పరిస్థితి విషమించడంతో ఖమ్మం తీ సుకువెళ్లాలని ప్రైవేట్ డాక్టర్ బండి శ్రీనివాస్ సూచించాడని అయిన ప్ప టికీ తన భార్య చనిపోయిందని మృతురాలి భర్త ఫిర్యాదు చేశాడని డిఎస్పీ తెలిపారు. ఈ మేరకు తుం గతుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని అనంతరం జరిగిన సం ఘటనపై పూర్తి విచారణ జరిపా మని తెలిపారు.
ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాసును వి చా రించగా మృతు రాలి భర్త మూడవ సారి కూడా ఆడబిడ్డ ఉన్నదని అ బార్షన్ చేయాలని తన హాస్పిటల్ కి వచ్చారని తెలిపారు. అబార్షన్ చేసే క్రమంలో అధిక రక్తస్రావం కావడం వల్ల ఖమ్మం తీసుకువెళ్లగా చనిపో యిందని ప్రైవేట్ డాక్టర్ శ్రీనివాస్ ను విచారించగా తమ దర్యాప్తులో తెలిపినట్లు డిఎస్పీ తెలిపారు. కా గా కేసును తుంగతుర్తి సీఐ నర సిoహారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారని 108/25 నేరం సంఖ్య ప్ర కారము భారతీయ న్యాయ సం హిత మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ సెక్షన్ 23, సెక్షన్ 3, మరియు ఫ్రీ కాన్సెప్షన్ అండ్ ఫ్రీ నటల్ డయాగ్నస్టిక్స్ టెక్నిక్స్ చట్టం 1994 ప్రకారం దర్యాప్తు చేయడం జరిగిందని ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి తెలిపారు.
తమ దర్యాప్తులో నేరం జరిగిన వి ధానాన్ని డీఎస్పీ తెలిపారు. మద్దిరా ల మండలం గోరంట్ల గ్రామానికి చెం దిన బయగల శ్రీను భార్య విజితల కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మూడవసారి గర్భం దాల్చడంతో గర్భంలో ఉన్నది ఆడ మగ తెలియ డం కోసం ఖమ్మం పట్టణంలోని పో లంపల్లి కల్పన నిర్వహిస్తున్న స్కా నింగ్ సెంటర్లో స్కానింగ్ చేయించి ఆడపిల్ల అని తెలుసుకోవడం జరి గినట్లు తెలిపారు. స్కానింగ్ చేయిం చడానికి ఖమ్మం పట్టణానికి చెందిన తుమ్మచెర్ల అరుణ అనే నర్స్ వీరికి సహకరించినట్లు తెలిపారు .అలాగే ఖమ్మం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ సోంపేట అశోక్ స్కా నింగ్ పరికరంతో కడుపులో ఉన్నది ఆడ మగ అని నిర్ధారించడం జరిగిం దని సోంపేట అశోక్ కు లింగ నిర్ధా రణ పరీక్ష చేయడానికి పులి వీరభ ద్రరావు అనే అతను స్కానర్లు సమ కూర్చినట్లు తమ దర్యాప్తులో గుర్తిం చడం జరిగిందని తెలిపారు. గర్భం లో ఉన్నది ఆడ మగ అని తెలప డం చట్టరీత్యా నేరమని డీఎస్పీ అ న్నారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కేసును విచారణ చేసి ముందస్తు లింగ నిర్ధారణ పరీ క్షలు చేసిన అబార్షన్ చేసిన దీనికి సహకరించిన ఏడుగురు నిందితు లను గుర్తించి బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పీ తెలిపారు.తమ విచారణ లో తేలిన నిందితులుA1 గా ప్రై వేట్ ఆర్ఎంపి బండి శ్రీనివాస్ (47), A2 మృతురాలి భర్త బయగల శ్రీ ను,A3 గా సంపేట అశోక్ ల్యాబ్ టె క్నీషియన్ A4 గా పులి వీరభద్రరా వు స్కానింగ్ మిషన్ సమకూర్చిన వ్యక్తి అని A5 గా తుమ్మ చర్ల అరు ణ నర్సు A6 గా ఖమ్మం లోకల్పనా క్లినిక్ నిర్వాహకురాలు పోలంపల్లి కల్పన A7 ప్రైవేట్ ఆర్ఎంపి పా ను గంటి సతీష్ లపై కేసు నమోదు చే సి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ట్లు తెలిపారు. ఈ సమావేశంలో తుంగతుర్తి సీఐ నరసింహారావు ఎస్సై క్రాంతి కుమార్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు.