–రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి
–దళితుల కు ఇచ్చిన హామీ మేరకు 18 శాతనికి
రిజర్వేషన్లు
–డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించాలి
–మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాళ్ళ మధుబాబు
Lakumalla Madhubabu : ప్రజాదీవెన నల్గొండ : ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ల కేటాయింపుల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం చేసిన రోస్టర్ విధానం సరిగా లేదని వెంటనే సవరించాలని కోరుతూ మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా 2011 జనాభా లెక్కలను తీసుకొని ఎంఫరికల్ డేటా లేకుండానే జస్టిస్ శమీ మక్తల్ ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగా ఎస్సీల ను కులాల వారిగా వర్గీకరించి మాలలతో పాటు మరో 25 కులాలను గ్రూప్ 3 లో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్ లను కల్పించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదు శాతం కూడా విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ లు అందకుండా రోస్టర్ విధానాన్ని రూపొందించారని పేర్కొన్నారు. గ్రూప్ 1లో అత్యంత వెనుకబడిన కులాలకు 15 కు ఒక పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. వీరికి కేటాయించిన రోస్టర్ పాయింట్ 7, గ్రూప్ 2లో మాదిగ, మాదిగ ఉప కులాలు 18 ను ఉంచి వారికి 9 శాతం రిజర్వేషన్ కేటాయించగా వీరికి రోస్టర్ పాయింట్లు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గా ఉన్నాయి.
గ్రూప్ 3 లో మాల, మాల ఉపగులాలు 26 ను ఉంచి రిజర్వేషన్ కేటాయించగా ఈ రోస్టర్ పాయింట్లు 22, 41, 62, 77, 91 గా ఉన్నాయి. ఈ అసంబద్ధ రోస్టర్ విధానం ద్వారా మాల, మిగతా 25 కులాలు ఉన్న గ్రూపు 3 వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అందుకు నిదర్శనం శాతవాహన యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ల లో ఎస్సీలకు మొత్తం ఆరు పోస్టులకు కేటాయించగా మొత్తం 15 శాతం లో 5 శాతం గా ఉన్న మాల, మాల ఉపకులాల వారికి రెండు పోస్టులు కేటాయించవలసి ఉండగా ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం అంటే ఈ రోస్టర్ విధానం ఎంత లోపాయిబిష్టంగా ఉందనేది అర్థమవుతుందని అన్నారు. నిజానికి గ్రూపు 1 లోని అత్యంత వెనుకబడిన కులాలకు రెండవ రోస్టర్ కేటాయించవలసి ఉండగా 7వ రోస్టర్ కేటాయించడం జరిగింది. గ్రూపు 2 లోని మాదిగ, మాదిగ ఉపకులాల వారికి7వ రోస్టర్ ను గ్రూప్ 3 లో మాల మాల ఉపకులాలకు 16 రోస్టర్ పాయింట్లను కేటాయించడంతోపాటు మిగతా రోస్టర్ పాయింట్లను కూడా సవరించాలని డిమాండ్ చేశారు. ఈ రోస్టర్ విధానాన్ని సవరించే వరకు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా దళితుల జనాభా ప్రకారం ఇచ్చిన హామీ మేరకు 18 శాతం రిజర్వేషన్లు వెంటనే పెంచాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని వెంటనే ప్రారంభించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి జంగాల భిక్షంగారు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాలపాటి సుమలత, నల్లగొండ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రాయల మౌనిక, జిల్లా కార్యదర్శి బూరుగు శ్రీలత, నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జంగాల శ్రీనివాస్, గుర్రంపొడు మండల అధ్యక్షుడు సల్వాది ప్రభాకర్, గుర్రంపోడు యూత్ అధ్యక్షుడు సల్వాది రజినీకాంత్, మాల మహానాడు నాయకులు తిరగమల్ల రమేష్, బూరుగు అంజయ్య, గంటల బిక్షం, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్,
వెంకటయ్య, బిక్షం, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.