Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SFI : ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏకగ్రీవ ఎన్నిక

SFI : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా మహాసభలు 19,20తేది లలో నల్లగొండ పట్టణంలోని ఎఫ్సీఐ పంక్షన్ హల్ సీతారాం ఏచూరి ప్రాంగణం లో నిర్వహించడం జరిగింది.అనంతరం నల్లగొండ జిల్లా అధ్యక్షా కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. నూతన జిల్లా కమిటీ 28మందితో పాటు నూతన జిల్లా ఆఫీస్ భేరర్స్ గా 10మందితో ఎన్నిక అయ్యారు.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా రంగ సమస్యలపై అధ్యయనం చేసి‌ బలమైన విద్యార్థి ఉద్యమాలు చేపట్టుతామని చెప్పారు.గత సంవత్సరం కాలం లో జరిగిన ఉద్యమాలపై లోటుపాట్లను అధిగమించే విధంగా చర్యలు జరిగాయని తెలిపారు.ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేయడం జరిగింది.

ముఖ్యంగా తీర్మానాలు,తెలంగాణ రాష్ట్ర లో వున్నా పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని,నల్లగొండ జిల్లా వ్యాప్తంగాఅద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లు కు గురుకుల పాఠశాల లకు సోంత భవనాలు నిర్మించాలని,నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని మరియు రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీ లను అభివృద్ధి చేయాలని, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రి ని కేటాయించాలని రాష్ట్రంలో ఖాళిగా వున్నా ఉద్యోగులు భర్తీ చేయాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి 1000కోట్లు కేటాయించాలని.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీని వెనక్కి తెలుసుకోవాలని ఇలా పలు తీర్మానాలను మహాసభ ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై బలమైన సమస్యల విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి పేద మధ్యతరగతి విద్యార్థులు ముందుకు సాగే విధంగా విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ ఒక ఛాంపియన్ల పోరాటం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ మహాసభలకు ఆర్థికంగా,హర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ విద్యా వంతులకు మేధావులకు, మీడియా మిత్రులకు , పత్రిక విలేకరుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.నూతన జిల్లా ఆఫీస్ భేరర్స్ గా కుర్ర సైదా నాయక్, కోరె రమేష్, బుడిగ వేంకటేష్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్,రవి,కావ్య, స్పందన జిల్లా కమిటీ సభ్యులు లను ఎన్నికయ్యారు.