Shaligouraram ZP School: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం జడ్పి స్కూల్ (Shaligouraram ZP School) 2005-06 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో (school premises)పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.18 ఏళ్ల తరువాత వారందరు ఒకే వేదికపై కలుసుకోవడం తో ఆనందానికి అవధులు లేవు.ఆనాటి జ్ఞాపకాలను ఎంతో ఆప్యాయత తో ఒకరినొకరు నెమరు వేసుకున్నారు.అప్పటి ఉపాధ్యాయులను (Teachers)ఘనంగా సన్మానిచించారు. ఈ కార్యక్రమం లో అప్పటి హెచ్ ఎం జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు గురువారావు,కుశలవరెడ్డి, కృష్ణారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,రామ్మూర్తి, జాన్ వెల్సన్, రవిబాబు,యాదమ్మ,సైదమ్మ,అప్పటి హాస్టల్ వార్డెన్ గంటెల నాగభూషణం,ప్రస్తుత హెచ్ఎం కోట మల్లయ్య, పూర్వ విద్యార్థులు మోలుగూరి కృష్ణ, టేకుల నవీన్, తాల్లూరి రమేష్,కడారి మల్లేష్, కర్నాటి కృష్ణ,కొండ నరేష్,నాగుల్ మీరా, తాటిపాముల హేమాద్రి,కె రవి, సుభాషిణి, పార్వతమ్మ, సంధ్యారాణి, మణెమ్మ, నాగమ్మ, మంజుల,తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.