Shanta Kumari : ప్రజాదీవెన, నల్గొండ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు డి రవీందర్ మార్గదర్శకత్వం లో ” నియోడియం గెడలోనియం లను నికెల్ మరియు నిఖిల్- జింక్ ఫెరైట్ల సంయోగం చెందిన నానో ఫర్ రైట్ల ధర్మాలు” అనే అంశంపై పరిశోధన చేసి తన పరిశోధన గ్రంథాన్ని సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కేంద్రానికి చెందిన పల్ల ముత్తయ్య, లక్ష్మమ్మ ఏడవ సంతానమైన పల్ల శాంతకుమారి ప్రాథమిక విద్యాభ్యాసం దామరచర్ల అనంతరం మిర్యాలగూడ లో పూర్తి చేసారు.
ఈ పదార్థాలను డాటా స్టోరేజీ పరికరాల తయారీలో మరియు ఆడియో వీడియో టేప్ పిగ్మెంట్లలో మ్యాగ్నెటిక్ సెన్సార్లను డ్రగ్ డెలివరీలో మరియు డేటా స్టోరేజ్ డివైస్లలో వినియోగిస్తారని తెలిపారు. తమ సహాధ్యాపకురాలు డాక్టరేట్ అందుకోవడం పట్ల సహచర అధ్యాపకులు డా సత్తిరెడ్డి, మిత్రులు ఆత్మీయ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.