SHE TEAMS: ప్రజా దీవెన, కోదాడ: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ (SP Sunpreet Singh)ఐపిఎస్ ఆదేశాల మేరకు షీ టీమ్ ఎస్ఐ నీలిమ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని GV మాల్ లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన మాల్ లో పని చేసే మహిళా సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా షి టీమ్ ఏఎస్ఐ కృష్ణమూర్తి (Shi team ASI Krishnamurthy) మాట్లాడుతూ మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాఫ్ నెంబర్ 8712686056 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు.టీ సేఫ్” యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని తెలిపారు వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం (Disclosure) చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని తెలిపారు తెలిపారు.మొబైల్ యాప్ (mobile app) లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గోవింద్, కానిస్టేబుల్ యాకూబ్, షీ టీం మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి, పాల్గోన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.