Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sheikh Baghdad: కబడ్డీ అసోసియేషన్ కోదాడ మండల అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్ ఎన్నిక

ప్రజా దీవెన,కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు షేక్ బాగ్దాద్ మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా హడక్ కమిటీ అధ్యక్షులు భూలోకరావు, కర్తయ్య నియమించారు మంగళవారం పట్టణంలోని స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో బాగ్దాద్ కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు. కబడ్డీ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు.

ఈ సమావేశంలో అల్లం ప్రభాకర్ రెడ్డి, పందిరి నాగిరెడ్డి,గంధం పాండు, ఎస్ఎస్ రావు,సైదిబాబు తదితరులు పాల్గొన్నారు. కోదాడ మండల కబడ్డీ అసోసియేషన్
కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా కత్తి సైదులు,వెంకటరత్నం, రఫీ,ప్రధాన కార్యదర్శిగా నామా నరసింహారావు,సంయుక్త కార్యదర్శి కాంపాటి శ్రీనివాసరావు,షేక్ బాజాన్, పంది తిరపయ్య,ట్రెజరర్ సోంపంగు శ్రీను,నాల్లయ్య ఈసీ మెంబర్లుగా షేక్ షఫీ, శ్రీను, జానీ మండల అసోసియేషన్ చైర్మన్ గా షేక్ ముస్తఫా,గౌరవ అధ్యక్షులుగా మహబూబ్ జానీ, ఈదుల కృష్ణయ్య, ఆరుమళ్ళ సీతయ్య లు ఎన్నికయ్యారు.