Sheikh Naeem: ప్రజా దీవెన,కోదాడ: బిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ నయీమ్ మాట్లాడుతూ భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఉక్కు మహిళ, నాడు మహిళలను చిన్నచూపు చూస్తూ వంటింటికే పరిమితం చేసే ఆ నాటి రోజుల్లో మహిళలు బయటకు రావడానికి ఎన్నో ఆంక్షలు పెట్టిన ఆనాటి పరిస్థితులలో, కొంతమంది అగ్రకులాల వారికే చదువు పరిమితమై ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాల మహిళలను చేరదీసి వారికి విద్యను నేర్పి వారిలో చైతన్యాన్ని నింపిన గొప్ప వీరవనిత, చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే తన భర్త తో కలిసి సమాజంలోని అంటరానితనం, అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీరవనిఅని ఆయన వివరించారు.
వారి ఆశయాల సాధన కోసం మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్ గారు, పట్టణ యువజన సంఘాల అధ్యక్షుడు దొంగరి శ్రీనివాస్, కర్ల సుందర్ బాబు, BRS పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ అబ్బుబకర్, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ ఆరిఫ్, 34వ, వార్డు అధ్యక్షుడు చీమ శ్రీనివాసరావు బిఆర్ఎస్ పట్టనాయకులు చలిగంటి వెంకట్, కాసాని మల్లయ్య గౌడ్, బొజ్జా గోపి, గొర్రె రాజేష్.ఎండి ఇమ్రాన్, గంధం శ్రీను సుంకర అభిధర్ నాయుడు, చింతల లింగయ్య, మాదాల ఉపేందర్ యాదవ్, జానీఆర్ట్స్, షేక్ ఖాజా, నిస్సార్, షేక్ బడేమియా, షేక్ దస్తగిరి, షేక్ కరీమ్, కర్ల శివాజీ, కలకొండ వెంకటనారాయణ, కుడుముల సైదులు, గొర్రెముచ్చు రవి తదితరులు పాల్గొన్నారు