*పట్టణంలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరం చేయాలి. నయీమ్
Sheikh Naeem: ప్రజా దీవెన కోదాడ: ,అకాల వర్షాలతో పట్టణంలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యలను వెంటనే పరిష్కరించాలని బి ఆర్ ఎస్ పార్టీ (brs)కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ (Sheikh Naeem) అన్నారు.గురువారం పట్టణంలో నెలకొన్న పలు సమస్యలపై ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలో (Drainage with rains) నెలకొన్న వ్యర్థాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇప్పటికిప్పుడు డ్రైనేజీల్లో (Drainage ) పేరుకుపోయిన మురుగు తీసి రోడ్డుపైన పడేయడం సరికాదన్నారు. గత వారం రోజులుగా డ్రైనేజీలో బురద రోడ్డు పైన పడటంతో అనేక రోగాలతో (With many diseases)ప్రజలు ఆసుపత్రి పాలు అవుతున్నారని నేటి వరకు మున్సిపల్ సిబ్బంది దోమల మందు బ్లీచింగ్ చేయలేదని వైద్య ఆరోగ్య సిబ్బంది (With many diseases) ప్రజలను కనీసం పట్టించుకోలేదని . ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గట్ల కోటీశ్వరరావు, కర్ల సుందర్ బాబు, కాసాని మల్లయ్య, చలిగంటి వెంకట్,గొర్రె రాజేష్, పట్టణ యువజన సంఘాల అధ్యక్షులు దొంగరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.