*కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్ :షేక్ నయీమ్.
ప్రజా దీవెన, కోదాడ: లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం అందజేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మాసిటీకి భూములు ఇవ్వని రైతులపై అన్యాయంగా, అరాచకంగా అక్రమ కేసులను పెట్టి నేటి వరకు విడుదల చేయకుండా ప్రభుత్వం వేధించడం సరైనది కాదన్నారు.
వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగాబి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అడ్వకేట్ పాలేటి నాగేశ్వరరావు, కౌన్సిలర్స్ మేదర లలిత, మామిడి రామారావు,చింతల నాగేశ్వరరావు, దొంగరి శ్రీను, కర్ల సుందర్ బాబు, బొజ్జా గోపి, షేక్ అబ్బుబకర్, ఎం.డి.ఇమ్రాన్ ఖాన్, చలిగంటి వెంకట్, జానీఆర్ట్స్, గొర్రె రాజేష్,అన్నెపాక కోటేష్, గంధం శ్రీను,సిద్దెల రాంబాబు, షేక్ నిజామ్, షేక్ దస్తగిరి, నరమనేని శ్రీనివాస్, బిపిఎల్ జాని, షేక్ నిస్సార్, సయ్యద్ నసీర్, మాడుగుల రాహుల్, కర్ల శివాజీ తదితరులు పాల్గొన్నారు.